కార్యకర్త కొడుకుతో పవన్‌.. వీడియో వైరల్

కార్యకర్త కొడుకుతో పవన్‌..
కార్యకర్త కొడుకుతో పవన్‌..

కర్నూల్ స‌భ‌లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. ఓ కార్య‌కర్త త‌న బిడ్డ తలకు ఎర్రటి తువ్వాలు చుట్టి.. అచ్చం పవన్ కళ్యాణ్ లా రెడీ చేసి సభకు తీసుకువచ్చాడు. సభలో అతను ప‌వ‌న్ కంట ప‌డటంతో వెంటనే ఆ బుడ్డోడిని స్టేజ్ మీద‌కి తీసుకురావాలని చెప్పారు. వేదిక మీద‌కు వచ్చిన అబ్బాయిని అప్యాయంగా పలకరించాడు పవన్. ఎత్తుకుని భుజం మీద కూర్చోపెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.