వాట్సాప్‌ పేమెంట్స్‌

వాట్సాప్‌ పేమెంట్స్‌

ప్రముఖ సోషల్‌ మేసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూపీఐ లావాదేవీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో వాట్సాప్‌ పేమెంట్స్‌ను కొంత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా వాట్సాప్‌ పేమెంట్స్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండనుంది. గూగుల్‌పే తరహాలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను వాట్సాప్‌ ప్రకటించింది. వాట్సాప్‌ పేమెంట్స్‌కు యూజర్ల బేస్‌ పెంచుకునే క్రమంలో వాట్సాప్‌ ఈ ఐడియాతో ముందుకువచ్చినట్లు తెలుస్తోంది.

వాట్సాప్‌ పేమెంట్స్‌ వాడుతున్న యూజర్లు వారి స్నేహితుడికి లేదా ఇతరులకు రూ. 1 చెల్లిస్తే రూ. 51 రూపాయలను క్యాష్‌బ్యాక్‌ను వాట్సాప్‌ అందిస్తోంది. కాగా ఈ ఆఫర్ మొదటి ఐదు లావాదేవీలకు మాత్రమే చెల్లుబాటు కానుంది. ప్రతి ఐదు లావాదేవీలకు యూజర్లుకు కచ్చితమైన రూ. 51 క్యాష్‌బ్యాక్‌ వస్తోంది. వాట్సాప్‌ పేమెంట్స్‌ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా యూజర్లు మొత్తంగా రూ.255 వరకు క్యాష్‌బ్యాక్‌ను వాట్సాప్‌ నుంచి పొందవచ్చు. వాట్సాప్‌ పేమెంట్‌ సర్వీస్‌తో రిజిస్టర్‌ చేసుకున్న యూజర్ల బ్యాంక్‌ ఖాతాలో క్యాష్‌బ్యాక్‌ నేరుగా జమ అవుతుంది.

వాట్సాప్ పేమెంట్స్‌ చేయాలనుకునే వారు మొదట వాట్సాప్ అప్ డేట్ వెర్షన్ కలిగి ఉండాలి.వాట్సాప్‌ చాట్‌ ఆప్షన్‌లో కన్పించే ‘₹’ సింబల్‌పై ప్రెస్‌ చేయాలి. ఒక వేళ మీరు ముందుగానే రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు పేమెంట్‌ చేసే అప్షన్‌ కన్పిస్తోంది.ఒకవేళ చేయకపోతే ఇతర యూపీఐ యాప్స్‌ మాదిరిగానే మీ బ్యాంక్ అకౌంట్‌ను వాట్సాప్‌తో లింక్ చేయాలి.మీరు బ్యాంక్‌లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో, ఆ నెంబర్‌తోనే వాట్సాప్ ఉండాలి.యూపీఐ వెరిఫికేషన్ కోసం బ్యాంక్ నుంచి ఆటో డిటెక్ట్ ఎస్ఎంఎస్ వస్తుందివాట్సాప్ పే, యూపీఐ సెటప్ పూర్తయిన తర్వాత వాట్సాప్ చాట్ విండో నుంచే మీరు పేమెంట్స్ whచేయవచ్చు.