ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయం ఫై తమ నిర్ణయాన్ని చెప్పగా, టీడీపీ నేతలు, జనసైనికులు దానిని వ్యతిరేకించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఎంతో మంది స్వాగతించారు. అయితే ఈ విషయంలో జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చిరంజీవి ఒక లేఖ ని విడుదల చేసినట్లుగా నిన్న సోషల్ మీడియా లో ట్రెండ్ అయింది. విపరీతంగా వైరల్ కూడా అయింది.
అయితే ఇప్పటికే సై రా సినిమా కు సంబంధించి చిరు-జగన్ ల కలయిక ఇప్పటికి జనసైనికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే తమ్ముడు జనసేన పార్టీ నుండి జగన్ ఫై తీవ్ర వ్యతిరేకతని చూపిస్తున్నాడు. పాలన విషయంలో జగన్ ఫై విమర్శలు చేస్తున్నారు. నిన్న జగన్ పుట్టిన రోజు కావడం, జనసైనికులు కూడా అప్రమత్తంగా ఉండటంతో చిరు లేఖని ఫేక్ ఎడిట్ అని జనసైనికులు తేల్చేసారు. అయితే పవన్ వైఖరి కూడా దీనికి కారణం అని కొందరు భావిస్తున్నారు. చిరు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కి అండగా ఎలాంటి స్టేట్మెంట్ లు గానీ, వ్యాఖ్యలు కానీ చేయలేదు. ఏదేమైనా పవన్ కుటుంబీకుల తరపున జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఇలాంటి ప్రకటనలు రావడం జనసైనికుల్ని కలవరపెడుతున్నాయి.
