ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా జగన్ పరిపాలనపై ఒక వార్త సంచలనం రేపుతుందో.జగన్ ముఖ్యమంత్రి అయ్యిన తర్వాత పెట్టుబడిదారులు ఎవరుఎవరూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రావడం లేదని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి మనం వింటూనే ఉన్నాము.ఇదే అనుకుంటే చంద్రబాబు హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రంలో మొదలైన భారీ ప్రాజెక్ట్ “కియా మోటర్స్”. ప్రపంచంలోని అతి పెద్ద కార్ మార్కెట్ ఉన్న ఈ సంస్థకు చెందిన ఐదవ అతి ప్లాంట్ ను నెలకొల్పారు.
దీనితో రాష్ట్ర ప్రజలకు సహా రాష్ట్రానికి మంచి గుర్తింపు రావడంతో పాటుగా అభివృద్ధి కూడా వేగంగా పెరుగుతుంది అనుకుంటే ఇప్పుడొక మైండ్ బ్లోయింగ్ వార్త బయటకు వచ్చింది.ప్రపంచంలోనే నెంబర్ 1 న్యూస్ ఏజెన్సీ అయినటువంటి “రాయిటర్స్” వారు చెప్తున్నా కథనాల ప్రకారం ఇప్పటికే ఏపీలో ప్రారంభం చేసిన కియా మోటర్స్ వారు జగన్ పాలన నిమిత్తం వారు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా లేరని రాయిటర్స్ వారు తెలిపారు.
అందుకే ఇప్పటికే నెలకొల్పిన ప్లాంటును కాస్త తమిళనాడుకు తరలించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారని వారు తెలిపారు.దీనితో ఏ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఇంతకు మునుపే అనంతపురం జిల్లా ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ కియా మోటర్స్ కారు ఓపెనింగ్ వెళ్లి వారిని ఎలాంటి బెదిరింపు చర్యలకు గురి చేసారో చూసాము.వీటన్నిటి ఫలితమే ఇది అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే రచ్చ మొదలయ్యిపోయింది.