మహారాష్ట్రలోని థానేలో మరో దారుణం వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా అత్యంత కౄరంగా 29 మంది సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనర్హం. బుధవారం రాత్రి బాధితురాలు డోంబివాలిలోని మాన్పాడ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన బాలిక స్నేహితుడు. ముందుగా ఈ ఏడాది జనవరిలో మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడి, ఈ దృశ్యాలను వీడియో తీశాడు. ఈ వీడియోను అడ్డం పెట్టుకొని బ్యాక్‌మెయిల్ చేస్తూ మిగతావారు ఆమెపై పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 26 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అరెస్టు చేసిన వారందరిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఏసీపీ దత్తాత్రేయ వెల్లడించారు. గత తొమ్మిదేళ్లుగా బాధితురాలిపై అత్యాచారం పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.