ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అధికార పక్ష ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఒక తప్పు చేశారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ, రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన కరువు గురించి మాట్లాడుతూ… ప్రతిపక్ష నాయకుడిని కాస్త అధికార పక్ష నాయకుడిగా రోజా సంబోదించింది. కాగా “చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు పడవు ఎందుకంటే చంద్రబాబు, కరువు ఇద్దరూ కవల పిల్లలు, గత ఐదు ఏళ్లలో కృష్ణ నదిలో వరద నీరు ప్రవహించలేదు కానీ మద్యం ఏరులై పారింది. ఈ విషయంపై మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారు సభలో లేరు పారిపోయారు” అంటూ పప్పులో కాలేశారు రోజా. వెంటనే తప్పు తెలుసుకున్న రోజా “సారీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పారిపోయారు” అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.
కాగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మానిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం మద్యపాన నిషేధాన్ని దశల వారీగా జరుపుతున్నారని, కానీ మద్యపాన నిషేధం చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా సీఎం జగన్ ఎవరి మాట వినకుండా చాలా దైర్యంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడని ఎమ్మెల్యే రోజా వాఖ్యానించారు. ఇకపోతే రాష్ట్రంలో మద్యపాన నిషేధం జరపడం వలన ఎంతో మంది మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని, వారందరు కూడా సీఎం జగన్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటూంరని రోజా వాఖ్యానించారు.