రజినీకాంత్ నటించిన పెటా సినిమాకు తెలుగు వెర్షన్ లో వల్లభనేని అశోక్ విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రాని సంక్రాతికి విడుదల చెయ్యడంతో ఇక్కడ థియేటర్స్ కొరత ఏర్పడింది. మొదటి నుండి పెటా సినిమాకు థియేటర్స్ దొరకడం లేదని వల్లభనేని అశోక్ వాదిస్తున్నాడు. రీసెంట్ గా అయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చాలా ఆవేశానికి లోనైన్నారు. కెసిఆర్ గారు వంటి డైనమిక్ లీడర్స్ స్పందించాలి అన్నారు. టాలీవుడ్ లో కొంతమంది నిర్మాతలు దిల్ రాజ్, అల్లు అరవింద్, వంటి వారు సినిమా థియేటర్స్ లోనే పుట్టి పెరిగినట్లు చేస్తున్నారు. వాళ్ల వల్లన చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం లేదు. ఇల్లాంటి కుక్కలకు తెరాస ప్రభుత్వం గట్టిగ్గా బుద్ది చెప్పాలన్నారు. పెటా సినిమాతో విజయం సాదించి ఇలాంటి వారికీ గట్టిగా బుద్ది చెప్పుతాను అన్నారు.
పెటా సినిమాకు సంక్రాంతి నుండి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్, రామ్ చరణ్ వినయ విధేయ రామ దిల్ రాజ్ ఎఫ్2 చిత్రాలు ఉండటంతో వాటికీ సరిపడా సినిమా థియేటర్స్ బూకింగ్స్ ఉన్నాయి. ఇంకా మహానగార్లో ఓ పదిహేను ఇరవై పెద్ద థియేటర్స్ ఉన్న కానీ ఒక్క థియేటర్ కూడా అందులో పెటా సినిమా నోచుకోవడం లేదు. ఇకా సి-సెంటర్ విషయంలో కూడా పెటా సినిమాకు ధియేటర్ దొరికే పరిస్థితి లేదు. ఇకా రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేద్దాం అంటే విశ్వాసం, mr. మజ్ను చిత్రాలు ఆల్రెడీ అడ్వాన్సు తో ఉన్నాయి. అందుకే ఎలాగైనా పెటా ను సంక్రాతికి విడుదలచేసి హిట్ట్ కొట్టి చూపిస్తానని వల్లభనేని అశోక్ అన్నారు. కానీ ఇలాంటి నిర్మాతల వలన చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం లేదన్నారు. ఇలాంటి వారిని నయుంను ఎన్కౌంటర్ చేసినట్లు ఎన్కౌంటర్ చెయ్యాలన్నారు.