భారత్‌లో జరిగే తొలి డేనైట్ టెస్టుకు ముందు పింక్ సందడి జరుగుతుంది. క్రికెట్ అభిమానులంతా డే నైట్ టెస్టుపై ఎనలేని ఆసక్తి చూపిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్ మన టెస్టు గులాబీ వన్నెలద్దుకుంటున్న వేళ వచ్చేసింది. తొలి డేనైట్ టెస్టుకు గురించే తెగ మాట్లాడుకుంటున్న తరుణంలో భారత గడ్డపై కొత్త ఆటకు వేదికైన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ పింక్ షో అందరినీ ఆకర్షిస్తుంది.
వైస్ కెప్టెన్ రహానే భారత్‌లో చారిత్రక డేనైట్ టెస్టుపై కలలు కంటున్నానని జత చేసిన ఫొటో తెగ వైరల్ అయ్యి లైక్‌ల మీద లైక్‌లు వస్తున్నాయి. ట్విట్టర్‌లో తలగడ వద్ద గులాబీ బంతిని పెట్టుకొని నిద్రిస్తున్న ఫొటోను ఇప్పటికే ఆ టెస్టు కలల్లో మునిగిపోయాను అని ట్విటర్లో షేర్ చేశాడు. నైస్ పోజ్ జింక్స్ అని భారత కెప్టెన్ కోహ్లి కామెంట్ చేశాడు. ఓపెనర్ ధావన్ కూడా ఆ కలలోనే ఫొటో దిగావా ఏంటీ అని పోస్ట్ చేశాడు.
కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకి అభిమానులు పింక్ టీ షర్ట్‌లతో స్వాగతం పలికగా ఎయిర్‌పోర్ట్ గులాబీ టీషర్ట్‌లతో సందడిగా మారింది. దీంతో. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే విమానంలో రాగ భారత కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రహానే ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే సందడి మొదలైంది. పింక్ బాల్ టెస్టు కొరకి వచ్చే వాళ్లకు సౌకర్యాలు కల్పించాలి. కచ్చితమైన టెస్టు క్యాలెండర్‌ను అమలు చేసి పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీరు, మంచి సీట్లు, కార్లకు పార్కింగ్ లాంటి అవసరాల్ని తీర్చాలి అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
పింక్ బాల్ తయారయ్యేందుకు ఏడెనిమిది రోజుల సమయం పడుతుండగా ప్రత్యేకించి గులాబీ రంగు వేసిన లెదర్‌ను వినియోగిస్తారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చారిత్రక డేనైట్ టెస్టు చూసేందుకు ప్రేక్షకులు ఐదు రోజుల మ్యాచ్‌లో మొదటి నాలుగు రోజుల టికెట్లన్నీ కొన్నారని తెలియ చేశారు.