తూగోలో వైకాపాకి షాక్…పవన్ గూటికి కీలక నేత…!

Pithani Balakrishna Meets Pawan Kalyan To Join Janasena

ఎన్నికల సమయం దగ్గరకు రావడంతో అన్ని పార్టీలలోనూ జంపింగ్ లు ఊపందుకున్నాయి. అయితే అధికార పార్టీనుండి వేరే పార్టీలకి నామమాత్రపు వలసలు ఉండగా ప్రతిపక్ష వైసీపీ నుండి మాత్రం రికార్డు స్థాయిలో వలసలు వేరే పార్టీల్లోకి సాగుతున్నాయి. తటస్థులు, వివిధ పార్టీలలో ఉంది టికెట్ రాదనుకున్న వారు, లేదా తమకు ప్రాధాన్యం లేదనుకున్న నేతలు ఒక్కరొక్కరుగా జనసేన పార్టీలో చేరుతున్నారు.

pawankalyan

తాజాగా తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ, మొన్న వైసీపీ మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్ జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు వారి బాటలోనే పవన్ జెండా మోసేందుకు తూగో జిల్లా ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో బలమైన నేత పితాని బాలకృష్ణ జనసేనకు జై కొట్టారు. శెట్టిబలిజలతో పాటు వెనుకబడిన కులాలవారికి తాను అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారని. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ తగు ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారని అందుకే పవన్ గోదావరి జిల్లాల పర్యటన సమయంలో తన అనుచరులతో కలసి పార్టీలో చేరనున్నట్లు పితాని బాలకృష్ణ ప్రకటించారు. పవన్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

janasena