టాలీవుడ్‌పై మళ్లీ విరుచుకు పడ్డ శ్రీరెడ్డి

కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా ఉద్యమంను మొదలు పెట్టిన శ్రీరెడ్డి కాస్త హద్దులు మీరి సినీ ప్రముఖుల మీదకు విమర్శలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా ఈమె తన బయోపిక్‌ను చేయబోతున్నట్లుగా ప్రకటించింది. తమిళంలో ఈమె బయోపిక్‌కు ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో టాలీవుడ్‌పై షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. తాజాగా తమిళనాట మీడియా సమావేశం నిర్వహించిన శ్రీరెడ్డి మాట్లాడుతూ టాలీవుడ్‌ మొత్తం నాలుగు ఫ్యామిలీ చేతిలో నలిగి పోతుంది అంటూ వ్యాఖ్యలు చేసింది. తమిళ మీడియాలో తెలుగు సినిమా పరిశ్రమ గురించి శ్రీరెడ్డి విమర్శలు చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.

sri reddy

శ్రీరెడ్డి గత కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా సినీ పరిశ్రమపైనే విమర్శలు చేయడం చర్చనీయాంశం అయ్యింది. దేశంలో పలు భాషల సినిమా పరిశ్రమలు ఉన్నాయి. కాని అన్నింటిలోకి తెలుగు సినిమా పరిశ్రమ చాలా నీచమైనదిగా ఆమె అభివర్ణించింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న నీచమైన సాంప్రదాయం మరే పరిశ్రమలో కూడా లేదు అని, ఇతర సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు సాంకేతిక నిపుణులు తెలుగు వారిని చూసి నేర్చుకుని చెడిపోతున్నారు అంటూ శ్రీరెడ్డి చెన్నై మీడియా సమావేశంలో చెప్పుకొచ్చింది. తన బయోపిక్‌లో తెలుగుకు చెందిన పలువురి స్టార్స్‌ను బజారుకు ఈడ్చుతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

sri-reddy