రైతుల అకౌంట్లోకి మళ్లీ పీఎం కిసాన్ డబ్బులు

రైతుల అకౌంట్లోకి మళ్లీ పీఎం కిసాన్ డబ్బులు

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతేడాది కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి రూ.6 వేల ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. దీంతో కోట్లాది మంది రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన 10వ వాయిదాను రైతుల అకౌంట్లోకి బదిలీ చేసి వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపింది.

10వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.2000 రైతుల అకౌంట్లోకి క్రెడిట్ అయ్యాయి. అయితే ప్రభుత్వం 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఈ నెలలోనే విడుదల చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తోన్న ఈ ఆర్థిక ప్రయోజనాలను ఇప్పటి వరకు పొందని రైతులు, ఈ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద తమ పేరును రిజిస్టర్ చేసుకుని రూ.2 వేలను పొందవచ్చు.

ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్యలో తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఆగస్టు 1 నుంచి 30 నవంబర్ మధ్యలో రిలీజ్ చేస్తుంది. ఇక మూడో ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్యలో రైతుల అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. ఈ ఇన్‌స్టాల్‌మెంట్లను నేరుగా రైతుల అకౌంట్లోకి క్రెడిట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఈ స్కీమ్‌ల రిజిస్ట్రేషన్ చాలా తేలిక. ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను పూర్తిచేసుకోవచ్చు. అంతేకాక పంచాయతీ సెక్రటరీ లేదా పట్వారి లేదా లోకల్ కామన్ సర్వీసు సెంటర్ ద్వారా మీరు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అక్కడ ‘New Farmer Registration’కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ఆధార్ నెంబర్‌ను నమోదు చేయాలిదీంతో పాటు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయడం ద్వారా రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాసెస్ ముందుకెళ్తోంది.ఈ దరఖాస్తులో మీ పూర్తి సమాచారాన్ని నింపాల్సి ఉంటుంది.

దీంతో పాటు బ్యాంకు అకౌంట్ వివరాలు, మిగతా సమాచారాన్ని నింపాలి.ఆ తర్వాత మీ దరఖాస్తును సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.రైతులు ఆధార్ నెంబర్‌ను లేదా బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను తప్పు ఇస్తే.. రైతుల అకౌంట్లోకి మనీ రావు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని, జాగ్రత్తగా దరఖాస్తును రైతులు నింపాల్సి ఉంటుంది.