మోడీకి ప్లస్ అవుతుందా…ఓసీలకా…?

PM Modi Decided 10% Reservation For OC

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు సరైనవేనా ? ఈ నిర్ణయం ఎవరికి ఉపయోగపడుతుంది ? 10శాతం రిజర్వేషన్లు మంచిదేనా? పేద అగ్రవర్ణ ప్రజలకు న్యాయం అంటున్నారు, నిజంగా న్యాయం జరుగుతుందా? ఇది ఎన్నికల ముందుకు మోదీ ఇస్తున్న ప్రకటన మాత్రమేనా? మోదీ ఈ నిర్ణయంతో రాజకీయంగా లాభం పొందాలని అనుకుంటున్నాడా? ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం అంటే నెలకు 66వేలు వస్తుంది. నెలకు 66వేలు వచ్చేవాళ్లకు రిజర్వేషన్ అవసరామా? ఇవన్నీ సగటు సామాన్యుడి మదిలో ఇప్పుడు మెదులుతున్న ప్రశ్నలు “అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌లు” ఇది ఎంతోకాలంగా వినిపిస్తున్న నినాదమే. అగ్రవర్ణాలలో ఉండే అందరూ జరగాలని కోరుకునేదే. తెలుగురాష్ట్రాలలో బ్రహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య.. తదితర కులాల వాళ్లు తమకూ రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తుండడం చూస్తున్నాం. బీసీ కులాలు, ఎస్సీలు, ఎస్టీల్లో అందరూ పేదలు కాదు ఓసీ కులాల్లోని అందరూ ధనికులూ కాదని వారి వారి ఆర్థిక శక్తిని బట్టి రిజర్వేషన్లను కల్పించాలని వీరు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇది నిజం. అందుకే ఇప్పుడు అందరూ పార్టీలకి అతీతఃమ్గా మోడీ నిర్ణయం మంచి నిర్ణయం అంటున్నారు.

నిజమే కానీ ఇప్పటికే అన్ని కలుపుకుని యాభై శాతానికి చేరిన రిజర్వేషన్ల శాతం మోడీ నిర్ణయంతో కలుపుకుంటే అరవైకి చేరుతుంది. రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండకూడదన్న సుప్రీంకోర్టు నిర్ణయానుసారాం మోడీ కేబినెట్ నిర్ణయం చెల్లదు. అయితే రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అర్హత ఏమిటంటే రూ. 8లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారు 5 ఎకరాల లోపు పొలం ఉన్నావారు. అంటే నాలుగు ఎకరాలు నాలుగు కోట్లు ఉన్నా రూ.8 లక్షల లోపు ఆదాయం అంటే నెలకు 66వేలు వస్తున్నా పేదవాడి క్రిందే లెక్క ఆ లెక్కన చూసుకుంటే 8 లక్షల కన్నా ఆదాయం ఎక్కువ చూపించేవాళ్ళు కనీసం 0.5 % కన్నా ఎక్కువుండరు. వాళ్లు ఎవరికి కూడా రిజర్వేషన్ అవసరమే ఉండదు. దేశంలో 99.5% కి 10% రిజర్వేషన్ ఇస్తే ఇక లాభం ఏముంది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని 1992లో సుప్రీంకోర్టు చెప్పింది. ఆ మేరకు ప్రస్తుతం మొత్తం రిజర్వేషన్‌లు 49 శాతంగా ఉన్నాయి. అందులో బీసీలకు 27శాతం, ఎస్సీలకు 16శాతం, ఎస్టీలకు 16శాతం కోటా ఉంది. దీనికి తోడు ఆర్ధికంగా వెనబడిన అగ్రకులాలకు ప్రత్యేకంగా 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 10 శాతం ఈబీసీ రిజర్వేషన్‌లు కల్పిస్తే మొత్తం రిజర్వేషన్ శాతం 59కి పెరగనుంది. అయితే ఇంతోటి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగం దక్కిన వాళ్లు ఫలాలు పూర్తిగా అందిన కుటుంబాలకు మళ్లీ రిజర్వేషన్ ఉండదు అనే నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. ఇప్పటికిప్పుడు 10శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చే స్థితి లేదని ప్రతీ ఒక్కరికీ తెలుసు అసలు ప్రతిపాదించిన మోడీకి కూడా తెలుసు మహిళా బిల్లులాగే దీనిపైనా చర్చలు సాగుతూ ఉంటాయ్..

సాగదీస్తూనే ఉంటారు. రాజ్యంగ సృష్టి కర్త అంబేద్క‌ర్ రాజ్యాంగం రాసేట‌పుడు ఎంతో ముందుచూపుతో రిజ‌ర్వేష‌న్ల‌ను కేవ‌లం ప‌ది సంవ‌త్స‌రాలకు ప‌రిమితం చేశారు. సామాజికంగా అణ‌చివేత‌కు గుర‌యిన వ‌ర్గాలకు సమాజంలో అన్నింటా అవ‌కాశాలు క‌ల్పించ‌డం ద్వారా వారి ప్ర‌గ‌తికి దోహ‌ద‌ప‌డాల‌నేది అసలు అంబేద్క‌ర్ ఉద్దేశం. కానీ దానిని అప్ప‌ట్నుంచి రాజ‌కీయంగా వాడుకోవ‌డం మొద‌లుపెట్టి నేటికి దానిని 60 శాతానికి తీసుకువ‌చ్చారు. అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితి వేరు. ఈ బిల్లు పాస్ అయితే, మోడీకి క్రెడిట్ వ‌స్తుంద‌ని తెలుసు. ఈ బిల్లు ఉద్దేశం కేవ‌లం రాజకీయ వ్యూహ‌మే అని తెలుసు అయినా ఓసీ పేద‌ల సంక్షేమానికి ఈ బిల్లు తోడ్ప‌డుతుంది. ముఖ్యంగా విద్యావ‌కాశాల్లో ఓసీల‌కు ఇది మంచి భ‌విష్య‌త్తును ఇస్తుందన‌డంలో అతిశయోక్తి లేదు. కాక‌ పోతే దీనిని ప‌త‌నం అవుతున్న త‌న కెరీర్‌ను నిలబెట్టుకోవ‌డానికి మోడీ అడ్డంగా వాడుకోవ‌డం ఇపుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఇక ఈ బిల్లు సంపూర్ణ మెజారిటీతో పాస‌య్యింద‌ని చెప్పాలి. లోక్‌స‌భ‌కు 326 మంది హాజ‌రు అయితే, 323 మంది స‌భ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఎన్నో రాష్ట్రాల నుండి ఎన్ని విన‌తులు వ‌చ్చినా దీనికి బీజేపీ ప్ర‌భుత్వం ఎలాంటి స‌వ‌ర‌ణ‌లు చేయ‌లేదు.