Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
PM Modi Not Attend To G20 Meeting In China
జీ 20 సమావేశాల్లో చైనా అధ్యక్షుడితో భేటీ ఉండదని ప్రధాని మోడీ అధికార ప్రతినిధులు తేల్చిచెప్పారు. దీంతో ఇండియాలో ఉత్సాహం, చైనాలో నిరుత్సాహం కనిపిస్తున్నాయి. చైనా దూకుడు పెంచిన తరుణంలో.. భారత్ కూడా కౌంటర్ యాక్షన్ రెడీ చేస్తోంది. పాకిస్థాన్ తరహాలో చైనాను కూడా ఒంటరి చేయాలని మోడీ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలతో డ్రాగన్ కలవరపడుతోంది. మోడీ తలుచుకుంటే ఏం చేసినా చేయొచ్చనేది ఆ దేశం అభిప్రాయం.
గుజరాత్ సీఎంగా మోడీ గురించి మిగతా ప్రపంచం కంటే చైనాకు బాగా తెలుసు. ఓ రకంగా మోడీ వల్లే చైనా వస్తువులు దేశీయ విపణిలో వరదలా వస్తున్నాయి. అదే మోడీ చక్రం అడ్డువేస్తే పరిస్థితి ఏంటో డ్రాగన్ కు తెలుసు. గుజరాత్ లో మేడిన్ చైనా వస్తువులు వాడిన మోడీ.. వాటినే దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇప్పటికీ చైనా వస్తువులకు గుజరాతే పెద్ద మార్కెట్. అందుకే మోడీని బహిరగ వేదికలపై కాదనలేని పరిస్థితి చైనాది.
రాజకీయం కంటే అవసరం ముఖ్యమని డ్రాగన్ కు బాగా తెలుసు. అయినా సరే భారత్ ను వీలైనంత మానసికంగా దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తోంది. మరి చైనా ప్లాన్ వర్కవుట్ అవుతుందా, మోడీ మైండ్ గేమ్ గెలుస్తుందా చూడాలంటే జీ 20 సమావేశం ముగియాల్సిందే. చైనా పేరు ప్రస్తావించకుండానే మోడీ చురకలు వస్తే డ్రాగన్ హిట్ వికెట్ అయినట్లే.
మరిన్ని వార్తలు: