అసలేం జరిగింది అంటే మండ్య ప్రాంతానికి చెందిన గిరీశ్, అదే ప్రాంతానికి చెందిన యువతి మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. గిరీశ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేవాడు. అయితే తాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ప్రియురాలిని కుటుంబికులు అందుకు అంగీకరించారు కూడాను. కానీ ఆ తర్వాత యువతి కుటుంబికులు అమ్మాయిని బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఉంచి మరో వ్యక్తితో పెళ్లికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ విషయం తెలుసుకున్న గిరీశ్ నెలరోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవాలనుకొని అలాంటి ప్రయత్నాలు చేశాడు. మరి ఆ తర్వాత తనకు దక్కని ప్రేమ మరొకరు పొందకూడదని భావించి ఆ అక్కసుతో ప్రియురాలిని చంపేయాలనుకున్నాడు. దాంతో తాజాగా ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ వెంటనే అక్కడే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.