ఉత్తర ప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ రౌడీమూక రెచ్చిపోయి ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరపడంతో 8మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. కాన్పూర్‌లో రౌడీషీటర్ వికాస్‌దూబేను పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే మృతి చెందిన వారిలో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అంటే… కరడుకట్టిన నేరస్థుడు వికాస్ దూబే గ్యాంగ్ ను పట్టుకొనేందుకు గత రాత్రి 16 మంది పోలీసు బృందం వెళ్లింది. అయితే ఈ విషయం ముందే తెలుసుకుని తమ భవనం పైన తుపాకులతో రెడీగా ఉన్న వికాస్ దూబే ముఠా సభ్యులు పోలీసులు వచ్చిన వెంటనే కాల్పులకు తెగబడ్డారు.