ఓ పోలీసు ఆఫీసర్ 12 రోజుల పసిపాప ప్రాణాలను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు. సౌత్ కరోలినాకు చెందిన ఓ మహిళ జూన్ 30న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే జులై 11వ తేదీన ఆ బిడ్డ పాలు తాగిన తర్వాత శ్వాస ఆడకపోవడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో కంగారుపడ్డ ఆ తల్లి తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి కారులో బయల్దేరింది. అతి వేగంతో వెళ్తున్న వీరి కారును ఓ పోలీసు అధికారి ఆపాడు. పాపకు ఏమైందిని ఆరా తీయగా.. శ్వాస ఆడడం లేదని ఆమె పోలీసు అధికారికి చెప్పింది.
తక్షణమే అంబులెన్స్‌కు ఫోన్ చేసి.. వైద్యులు వచ్చే వరకు.. ఆ పోలీసే బిడ్డ ఎదలపై రాస్తూ.. నోటిలో వేలి పెడుతూ తీస్తూ.. శ్వాస ఆడేలా చేశాడు. అలా సుమారు ఆరు నిమిషాల పాటు చేసి పసిబిడ్డకు ప్రాణం పోశాడు. ఇలా చేస్తున్న క్రమంలో మధ్యమధ్యలో శ్వాస తీసుకున్నప్పుడల్లా పాప ఏడ్చింది. బిడ్డకు ఏమవుతుందోనని తల్లి ఏడుస్తున్న దృశ్యాలు ప్రతీ ఒక్కరిని కదిలించేలా ఉన్నాయి. మొత్తానికి అక్కడికి చేరుకున్న వైద్యులు.. బిడ్డకు చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. పసిపాప ప్రాణాలను కాపాడిన పోలీసు అధికారిని ఉన్నతాధికారులు మెడల్‌తో సత్కరించారు. పోలీసు అధికారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Deputy W. Kimbro Saves 12-day-old Baby
When we wear the uniform and badge, we become what someone needs at that moment. For one Deputy that meant he needed to become the line between life and death for one young child.On June 11, a Deputy was conducting routine patrol in the unincorporated Summerville area of Berkeley County when he stopped a vehicle for speeding. What happens next was all captured on his department-issued body camera.Upon stopping the vehicle, the driver immediately exited the car and exclaimed that the baby in her vehicle had stopped breathing. Deputy W. Kimbro knew he needed to act immediately to save the baby’s life. Deputy Kimbro made contact with the 12-day-old baby and her mother in the vehicle. The mother told the Deputy the baby stopped breathing after drinking a bottle. Deputy Kimbro took the baby’s limp and cyanotic body and performed lifesaving first aid. As a result, he was able to get the baby to breathe again until EMS could arrive. Because of Deputy Kimbro’s steadfast, professional and heroic response, the 12-day old baby was able to live. Please join us in congratulating Deputy Kimbro for his gallant actions that prolonged human life. He was awarded the “Life-Saving Medal” from Sheriff Lewis for his heroic actions that day. Well done!
Publiée par Berkeley County Sheriff's Office sur Jeudi 11 juillet 2019