Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం అని అందరికి తెలుసు. కానీ చాలామంది హెల్మెట్ పెట్టుకోకుండానే బైక్లు నడుపుతుంటారు. పోలీసులు పట్టుకుంటే వందో, రెండొందలో జరిమానా కట్టి వెళ్ళిపోతున్నారు. కానీ మళ్ళీ హెల్మెట్ లేకుండానే రోడ్డు మీదకే వస్తున్నారు. దీనితో ఏమిచెయ్యాలో అర్ధం కానీ ఆగ్రా పోలీసులు ద్విచక్ర వాహనదారులకి కొత్త రకం శిక్షలు విధిస్తున్నారు. హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారిని ఒక అరకిలోమీటరు బైక్ నెట్టుకుంటూ వెళ్ళమంటూ హూకుం జారిచేస్తున్నారు. దీనివలన వాళ్ళకి వ్యాయామం అవుతుంది, ఈ సంఘటన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుండి పోతుంది ఇకపై బయటకి వచ్చేటపుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది అని అంటున్నారు ఆగ్రా పోలీసులు.
అసలే మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వాటిలో సూపర్ ఫాస్ట్ ఇప్పుడు ఈ శిక్ష చూసి మనోళ్ళు కూడా తొందరలో మొదలు పెట్టినా మొదలు పెడతారు. కాబట్టి బైకు బాబులు జరభద్రం మరి. హెల్మెట్ మర్చిపోకండి, లేదంటే బాబాయిల వింత శిక్షలకి రెడీగా ఉండండి మరి.