తెలంగాణలో ఘోరం జరిగింది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఓ అక్రమ సంబంధం వెలుగు చూసింది. మిర్యాలగూడ పట్టణంలోని శాంతి నగర్ కు చెందిన రసూల్, జాహ్నవి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే తన భార్యతో ఇదే కాలనీకి చెందిన సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి చాలా సన్నిహితంగా ఉంటున్నారని చెప్పి మూడు రోజుల క్రితం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అయితే ఈ రోజు ఫిర్యాదుకు సంబంధించి విచారణ కోసం ఇరు వర్గాలు స్టేషన్ కు వచ్చాయి. ఆ సమయంలో సదరు మహిళ భర్త రసూల్.. సత్యనారాయణ రెడ్డి పై స్టేషన్ ఎదుట కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితుడు తీవ్రగాయాలతో స్టేషన్ లోపలికు పరుగెత్తాడు. వెంటనే తేరుకొన్న పోలీసులు బాధితున్ని చికిత్స కోసం ఏ ప్రైవేటులు ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితుడు రసూల్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.