Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పందెం కాచేటప్పుడు వుండే ఊపు ఫలితం వచ్చేటప్పటికి టెన్షన్ గా మారుతుంది. ఆయా పార్టీల మీద నమ్మకం, అభిమానంతో నంద్యాల ఉప ఎన్నికల ఫలితం మీద కోట్ల రూపాయల పందేలు జరిగాయి. ఇంకొన్ని గంటల్లో నంద్యాల ఫలితాలు రాబోతున్నాయి. ఆ ఫలితం ఇటు టీడీపీ, అటు వైసీపీ అభ్యర్థుల మీదే కాదు వారి గెలుపు మీద కొండంత నమ్మకం పెట్టుకున్న వారి జీవితాల్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేయనుంది. కొంతమందికి గెలుపుతో పాటు డబ్బుని మరికొందరికి అపజయంతో పాటు ధన నష్టం కలగజేయనుంది. ఇలా పందేలు ఎక్కువగా కాచే అలవాటు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఉండేది. ఈసారి కాక రేపిన నంద్యాల ఎన్నిక సీమలో కావడంతో ఆ ప్రాంతంలోనూ ఈసారి పెద్ద ఎత్తున పందేలు జరిగాయి.
తాజాగా నంద్యాల మీద పందెం కాచిన వారిలో పెద్దపెద్ద నాయకులూ వున్న విషయం ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది. అధికార పార్టీ తో పాటు ప్రతిపక్షానికి చెందిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు , ఇద్దరు ఎంపీ లు ఈ పందేల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నట్టు తెలుస్తోంది. నంద్యాల ప్రచారానికి వెళ్లి అక్కడి పరిస్థితుల మీద తమ అవగాహనకి తగినట్టు సదరు నేతలు తమ అనుచరుల ద్వారా పెద్ద మొత్తాల్ని పణంగా పెట్టారు. అయితే ఎన్నికల తర్వాత వివిధ సర్వేల్లో వస్తున్న ఫలితాలు చూసి వాళ్లంతా టెన్షన్ పడిపోతున్నారు.
మరిన్ని వార్తలు: