హైదరాబాద్: భారాస అధినేత, తెలం గాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైంది. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సిరావొచ్చని భావిస్తున్నారు.
అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్స పై వైద్యు లు నిర్ణయం తీసుకోనున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ కేసీఆర్కు గాయం కావడం పై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.