సంక్రాంతి పండుగకి ప్రయాణికుల సౌకర్యార్థం మరో 200 కొత్త బస్సులను తీసుకువస్తున్నట్లు టిఎస్ఆర్టి సి ఎండి బీసీ సజ్జనార్ తెలిపారు. అందులో 50 బస్సులను వారం రోజుల్లో తీసుకు రావడానికి ఏర్పాట్లు చేస్తుంది. ప్రయాణికులకు మెరుగైన ,సౌకర్యవంతమైన సేవలను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాజధాని ఏసీ, కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, ఎక్స్ ప్రెస్ బస్సులను హైదరాబాదులోని బస్సు ప్రాంగణంలో సజ్జనార్ పరిశీలించారు. మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో బస్సుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, వీలైనంత త్వరగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడానికి 2000 బస్సులను మరో నాలుగైదు నెలల్లో తీసుకురావాలని అధికారులను సజ్జనర్ ఆదేశించారు. ఇందులో ఎలక్ట్రిక్ బస్సులు 1040 మిగతావి డీజిల్ బస్సులు.