Political Updates: ఎంపీ పదవికి కోమటిరెడ్డి రాజీనామా.. గడ్కరితో సమావేశం..

Political Updates: Komati Reddy resigns from the post of MP.. Meeting with Gadkari..
Political Updates: Komati Reddy resigns from the post of MP.. Meeting with Gadkari..

రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ డిల్లీకి వెళ్లనున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం కానున్నారు. నిన్న రోడ్లు,డ్లుభవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేళ్ళ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అన్నారు. అమెరికా ఈజ్ గ్రేట్… అమెరికన్ రోడ్స్ ఈజ్ గ్రేట్ అని పొగడ్తలతో ముంచేశారు. నాకు రోడ్లు భవనాలు శాఖ ఇచ్చినందుకు థాంక్స్ అన్నారు. కౌన్సిల్ హాల్ ను షిఫ్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇలా చేసే భాద్యత నాకు అప్పగించారని తెలిపారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేపడతామన్నారు.

నిన్న తొమ్మిది ముఖ్య ఫైల్స్ పై సంతకాలు చేసానని తెలిపారు. తన నియోజకవర్గ పరిధిలోని రోడ్లను 100 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చ బోతున్నామని తెలిపారు. మా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని.. నితిన్ గడ్కరీ అపాయింట్ మెంట్ తీసుకుని.. తనకున్న పరిచాయలతో ఢిల్లీనుంచి నిధులు తీసుకు వస్తా అని హామీ ఇచ్చారు. సినిమా వాళ్ళు ఇప్ప టి వరకు ఎవరూ ఫోన్ చేయలేదని.. ఒక్క దిల్ రాజు మాత్రమే ఫోన్ చేశారని అన్నారు. ఎల్బీనగర్ మల్కాపురం వరకు, మల్కాపురం నుంచి సూర్యాపేట వరకు 6 లైన్ల రోడ్డు పనులు చేయాలన్నారు. పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తుందని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కంటే ముందే విజయవాడకు వెళ్లే విధముగా చేస్తామన్నారు. కొత్త అసెంబ్లీలో నిర్మాణం లేదని, పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరిగా మారుస్తామన్నారు.