Political Updates: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Political Updates: PM Modi wishes Christmas
Political Updates: PM Modi wishes Christmas

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పండుగ అందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ సామరస్యం, కరుణస్ఫూర్తికి ప్రతీక. ప్రతి ఒక్కరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచం కోసం కలిసి పనిచేద్దాం. ప్రభువైన క్రీస్తు గొప్ప బోధనలను కూడా మనం గుర్తు చేసుకుందాం’ అని మోదీ ట్వీట్ చేశారు.

ఇక అటు ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు చెప్పారు. క్రిస్మస్‌ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు చెప్పారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులు అందరికీ సీఎం వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.