రాములమ్మకు రాజకీయాలు కష్టమే..?

politics-is-hard-for-ramula

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాములమ్మగా తెలంగాణ ఉద్యమ సమయంలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయశాంతి. ఇప్పుడు రాజకీయ సందిగ్ధంలో పడ్డారు. మొదట చెన్నై గోదాలో దిగాలనుకున్నా. శశి నుంచి స్పందన లేకపోవడంతో. తెలంగాణకే పరిమితం అవుతానని ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ మూడేళ్లుగా సైలంట్ గా ఉండి. ఇప్పుడు రాజకీయాలు చేసి ఆమె ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.

అసలిప్పుడు విజయశాంతికి అంత క్రేజ్ లేదనేది మరో వాదన. ఆమె రాజకీయ వైభవం టీఆర్ఎస్ తోనే పోయిందనే వారూ ఉన్నారు. కానీ సినిమాల పరంగా ఇప్పటికీ లేడీ అమితాబ్ కు కాస్తో కూస్తో క్రేజ్ ఉంది. అయితే ఆమె సినిమాలు బాగా ఆడి చాలా కాలమైంది. విజయశాంతి తన చుట్టూ ఓ చట్రం సృష్టించుకుని దాన్నుంచి బయటపడలేకే రాజకీయంగా ఫెయిలయ్యారనే వాదన బలంగానే ఉంది. 

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో విజయశాంతి రాజకీయంగా క్రియాశీలకమైతే కాంగ్రెస్ మాత్రం ఆదరిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ఆదరించొచ్చు.. ప్రజల సంగతేంటనే ప్రశ్న తెరపైకి వస్తోంది. మూడేళ్లుగా ఎక్కడా కనిపించలేదేంటన్న ప్రశ్నకు అనారోగ్యం అన్న చిన్న కారణం చెప్పడం అంత వీజీ కాదు. మరి రాములమ్మ అన్నట్లుగా నిజంగానే పొలిటికల్ గా యాక్టివ్ అవుతారా. మళ్లీ ఇంటికే పరిమితమౌతారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.