తిరుమల రాజకీయాలు మళ్ళీ మొదలు !

గత కొద్దిరోజులుగా తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు టీటీడీ బోర్డు మీదా తెలుగుదేశం ప్రభుత్వం మీదా అనేక విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న ఆరోపణలకు మద్దతు ఇస్తూ వైకాపా ఇప్పుడు మరో సారి స్వామి వారి మీద రాజకీయాలు చేసందుకు సిద్దమయ్యింది. గత పన్నెండేళ్ళతో పలిస్తే భక్తుల రద్దీ భారీగా పెరగడం వల్ల బోర్డు తొమ్మిదిరోజుల పాటు సామాన్య భక్తులను కొండ మీదకు రానివ్వమని ముందే చూసుకుని ఏర్పాట్లు చేసుకోమని ప్రకటించింది. ఇక ఆ ప్రకటన మీద కూడా రాజకీయ రంగు పులిమి విమర్శలు మొదలు పెట్టారు ఆ పార్టీ నేత రోజా. వచ్చే నెల 12 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించేందుకు హమహాసంప్రోక్షణ జరగనుంది. మహా సంప్రోక్షణ సమయంలో 9 రోజులపాటు భక్తులను దర్శనానికి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. 
టీటీడీ చరిత్రలో భక్తులకు దర్శనాన్ని నిలిపివేసి మహాసంప్రోక్షణ చేయడం ఇదే తొలిసారి. మహాసంప్రోక్షణ సమయంలో రోజుకు ఇరవై వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించడానికి వీలవుతుంది. ప్రస్తుతం కొండపైకి ప్రతీ రోజూ.. దాదాపుగా లక్ష మంది వస్తున్నారు. ఈలెక్కన రోజుకి ఇరవై వేల మంది దర్శనం కలిపిస్తే మిగతా 80 వేల మంది క్యూలైన్లలో మిగిలిపోతారు. అలా ఆరు రోజుల పాటు ఇరవై వేల మందికి దర్సనం కలిపిచి మిగతా వారిని ఆపితే నాలుగు లక్షల మందికిపైగా భక్తులు క్యూలైన్లలో ఉండిపోతారు. దీని వల్ల మరిన్ని ఇబ్బందులొస్తాయని భావించి పూర్తిగా దర్శనాలు నిలిపివేశారు. కానీ కొద్ది రోజులుగా టీటీడీ వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైకాపా దీన్నో ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమలలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రమణదీక్షితులు చెప్పిన మాటలు నిజమవుతున్నాయేమోనని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శించారు. శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసే అధికారం టీటీడీ పాలకమండలికి లేదన్నారు. ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే భక్తులతో కలసి ఉద్యమిస్తామమని ప్రకటన చేసారు.
ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహాసంప్రోక్షణ అంటే ఆలయంలో ఏమైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేయడం. శ్రీవారి గర్బాలయంలో చెయ్యవలసిన మరమ్మతు పనులు చాలా తక్కువే కాబట్టి మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిర్వహించాలని ఆగమ పండితులు నిర్ణయించారు. మరమ్మతుల కోసం గర్భగుడిలోకి ఎవరూ వెళ్లరు అర్చకులు మాత్రమే ఆ పనులు చేసే అవకాసం ఉంటుంది. అదే విధంగా ఆ సమయంలో మిగతా సేవల కోసం 30 వేల మంది భక్తులకి అవకాసం కలిపిస్తామని స్వయంగా టీటీడీ చైర్మనే ప్రకటించినా రోజా రాజకీయ ప్రకటనలు చేయడం అంటే దీనిని కూడా రాజకీయం చేయాలనుకునే వారి నైజం బయట పడటం కాక మరొకటి కాదు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.