Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారులు చెప్పారు. పో్లింగ్ సమయం ముగిసేలోపు ఓటింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు ఓటువేసే అవకాశం కల్పించామని తెలిపారు. నంద్యాల ఓటర్లలో కనిపించిన చైతన్యం కాకినాడలో లేదు. ఉప ఎన్నికలో ఓటువేసేందుకు నంద్యాల ప్రజలు భారీగా తరలివస్తే…కాకినాడ నగరంలో మాత్రం ప్రజలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఓటింగ్ మందకొడిగా సాగింది.
పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజల్ని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 60.43శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. ఈ ఎన్నికల్లో మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 196 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. నగరంలో ప్రజలు పోలింగ్ పై అంతగా ఆసక్తి చూపకపోయినా..శివారుప్రాంతాల్లో మాత్రం ప్రజలు ఓటువేసేందుకు ఆసక్తిగా తరలివచ్చారు. సెప్టెంబరు ఒకటిన కౌంటింగ్ జరగనుంది. నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన వెంటనే ఈ ఎన్నిక రావటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడలో పలు రోడ్ షోలలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. వైసీపీ కూడా భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. అయితే వైసీపీ ఎంతగా ప్రచారం చేసినా నంద్యాల ఫలితమే కాకినాడలోనూ రిపీట్ అవుతుందని తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు.
మరిన్ని వార్తలు: