మద్యపానం హానికరం అంటుంటారు.. చెప్పేవారు చెబుతుంటారు. తాగే వారు తాగుతూనే ఉంటారు. కానీ సామాజిక బాధ్యత కలిగి ఉండాల్సిన సెలెబ్రిటీలు సైతం మద్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రకటనల్లో నటిస్తుంటారు. అలాంటి ప్రకటనలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతుంటారు. ఇటీవల హీరోయిన్లు ఎక్కువగా విస్కీ, వైన్ వంటివాటికి అంబాసిడర్లుగా మారుతున్నారు. రెజీనా, ఇలియానా వంటి వారు ఈ మధ్యే ఇలాంటి ప్రకటనల్లో నటించారు. అప్పుడు నెటిజన్లు నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
ఇక ఇప్పుడు బుట్టబొమ్మ వంతు వచ్చింది. రెడ్ అంటూ జింజర్ చాలెంట్ అంటూ పెగ్గు కలిపింది. చిందులు వేసింది. తాను వేయడమే కాకుండా ఓ చాలెంజ్ విసిరింది. ఈ హుక్ స్టెప్పులతో ఓ వీడియోను చేయండని తన అభిమానులను కోరింది. రీ వైబ్ ది నైట్ అంటూ పూజా హెగ్డే రచ్చ చేస్తోంది. ఇది కేవలం 25 ఏళ్లు నిండిన వారికే అని చెప్పింది. బాధ్యతాయుతంగా తాగండనే హ్యాష్ టాగ్ కూడా పెట్టేసింది.
ఇలా చాలెంజ్‌లో పాల్గొంటే విన్నర్స్‌కు మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొనే చాన్స్ ఉంటుందట. త్వరలోనే విజేతల పేర్లను ప్రకటిస్తారట. మొత్తానికి పూజా హెగ్డే బ్రాండ్ మాత్రం జానీ వాకర్ అని తేలింది. ఇక పూజా వేసిన హుక్ స్టెప్పులు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను రాధే శ్యామ్, ఆచార్య సినిమాలతో పలకరించబోతోంది. ఇక హిందీలో ఏకంగా సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కోలీవుడ్‌లో దళపతి విజయ్ వంటి వారి పక్కన నటిస్తోంది. రీసెంట్‌గానే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ హిట్టుకొట్టేసింది.