ప్రభాస్ గురించి తన అభిప్రాయం చెప్పిన పూజా హెగ్డే

ప్రభాస్ గురించి తన అభిప్రాయం చెప్పిన పూజా హెగ్డే

బ్యూటిఫుల్ పూజ హెగ్డే కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.  పూజ కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్కటి కూడా సూపర్ హిట్ లేదు కానీ డిమాండ్ మాత్రం ఆకాశాన్ని తాకుతోంది. పూజ చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘హౌస్ ఫుల్ 4’ ఈ నెలలోనే రిలీజ్ అవుతోంది.  అల్లు అర్జున్ తో నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ జనవరిలో రిలీజ్ కానుంది.  ఈ రెండూ కాకుండా ప్రభాస్ కొత్త సినిమా ‘జాన్’ కూడా లైన్లో ఉంది.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘జాన్’ గురించి.. ప్రభాస్ తో పనిచేయడం గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. “సినిమా కథ 1970 లలో ఐరోపాలో జరుగుతుంది.. భారీ స్కేల్ ఉన్న సినిమా. నేను ఇప్పటివరకూ చేసిన బెస్ట్ స్క్రిప్టులలో ఒకటి” అని చెప్పింది. ప్రభాస్ ఫిలిం ఒక పరిణతి ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రేమ కథ అని.. ఈ సినిమాలో పాత్రకు ప్రిపేర్ అవ్వాల్సి వచ్చిందని తెలిపింది.

ప్రభాస్ గురించి మాట్లాడుతూ “ప్రభాస్ చాలా కూల్ గా ఉంటారు. ప్రభాస్ ఓ ఫుడ్ లవర్.  ఆయనకు తినడం అన్నా.. తినిపించడం అన్నా ఎంతో ఇష్టం.  మా సెట్ కు ప్రభాస్ రుచికరమైన భోజనం తెప్పించేవారు” అంటూ ‘జాన్’ షూటింగ్ విశేషాలను పంచుకుంది.  ‘బాహుబలి’ లాంటి సినిమా ప్రభాస్ లాంటి మంచి వ్యక్తికి లభించడం గొప్ప విషయం అని అభిప్రాయపడింది.  పూజ వ్యాఖ్యలు చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థం అవుతుంది.. అదేంటంటే ‘జాన్’ లో పని చేయడం పట్ల ఫుల్ ఎగ్జైట్ మెంట్ తో ఉంది.