ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్, పూజలు వరస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్- పూజ హెగ్డేల మధ్య మనస్పర్థలు వచ్చాయని, వారిద్దరు మధ్య మాటలు లేవని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఇటీవల ముంబైలో జరిగిన రాధేశ్యామ్ ప్రమోషన్ ఈవెంట్లో సైతం వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు కనిపించలేదు. పక్కనే పక్కనే ఉన్నప్పటికీ మూవీ హీరోహీరోయిన్ మధ్య ఉండే బాండింగ్, కెమిస్ట్రీ మిస్ అయ్యింది. ఈ కార్యక్రమంలో వారిద్దరూ ఎడమెహం, పెడమెహంగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చెకూరింది. అంతే ఇక మూవీ వీరిద్దరి మధ్య ఎవో మనస్పర్థలు వచ్చాయని అంతా ఫిక్స్ అయ్యారు. అందుకే ప్రమోషన్స్ల్లో ప్రభాస్- పూజల కలిసి పోజులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారనే వార్తలు జోరందుకున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పూజ ఈ వార్తలపై స్పందించింది. ఈ సందర్భంగా ఆమె వార్దిదరి మధ్య వివాదం అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ గొప్ప మనసున్న వ్యక్తి. షూటింగ్ సమయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ప్రతి రోజు ప్రభాస్ తన ఇంటి నుంచి భోజనం తెప్పించేవారు. అంత మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేమిటి? అదంతా పుకారే. నేనే కాదు ఎవరైనా సరే ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు’ అని చెప్పుకొచ్చింది.