పూజకు డిమాండ్‍ బాగా పెరిగింది

పూజకు డిమాండ్‍ బాగా పెరిగింది

ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో అన్ని పెద్ద సినిమాలకు ముందుగా కన్సిడర్‍ చేస్తోన్న పేరు పూజ హెగ్డే. ఇంతకుముందు హిట్లు లేవనే పేరుండేది కానీ అల వైకుంఠపురములో తనకు ఆ లోటు కూడా తీర్చేసింది. మరోవైపు బాలీవుడ్‍లో కూడా ఆమెకు విపరీతమైన డిమాండ్‍ వుంది. అక్కడ భారీ చిత్రాలలో పూజను ఏరికోరి ఎంచుకుంటున్నారు.

బాలీవుడ్‍లో హీరోయిన్ల కొరత వుండడం వల్ల పూజకు డిమాండ్‍ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఏ సినిమా అయినా తన టర్మ్స్ అండ్‍ కండిషన్స్ మీద చేసుకునే సౌలభ్యం తనకు దక్కింది. గతంలో కోటి.. కోటిన్నరలో సినిమా చేసిన పూజ ఇప్పుడు తెలుగు సినిమాకు కూడా రెండున్నర కోట్లు అడుగుతోంది. తను హీరోయిన్‍ అయితే పాన్‍ ఇండియా అప్పీల్‍ వుంటుందనేది ఆమె లాజిక్‍.

కానీ హీరోయిన్లకు అంత పారితోషికం ఇచ్చే ఆనవాయితీ ఇక్కడ లేదు. దీంతో పూజకు ఆల్టర్‍నేటివ్స్ ఎవరని మన నిర్మాతలు అన్వేషిస్తున్నారు. బాలీవుడ్‍లో ఇంకా పాపులర్‍ కాని తారలను తీసుకొచ్చి పూజ అడిగే దాంట్లో అయిదో వంతు డబ్బులతో పని జరిగిపోయేట్టు చూసుకుంటున్నారు. అయితే తన అవకాశాలు చేజారుతున్నా పూజకు ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడామె అడిగినంత ఇచ్చే నిర్మాతల లిస్టే చాలా పెద్దదుంది.