టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారం రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. ఇప్పటికే కిషన్ పలువురి పేర్లను వెళ్లడి చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇటీవల కిషన్ సంప్రదించాడు అంటూ పలువురు హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇటీవలే యాంకర్ అనసూయ మాట్లాడుతూ తనకు కిషన్ అండ్ టీం నుండి తెలుగు సంఘం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం వచ్చిందని, అయితే వారి పద్దతి నాకు నచ్చక పోవడంతో తిరష్కరించాను అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా హీరోయిన్ పూనం కౌర్ కూడా విషయమై నోరు విప్పింది.
సోషల్ మీడియాలో తాజాగా పూనం కౌర్ ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పోస్ట్ చేసింది. కొన్నాళ్ల క్రితం కిషన్‌కు సంబంధించిన వ్యక్తులు కొందరు నేను హోటల్ రూంలో ఉన్నప్పుడు వచ్చి చెడుగా ప్రవర్తించారు. ఒక అర్థరాత్రి సమయంలో ఒక వ్యక్తి వచ్చి గది తలుపు తట్టాడు. అతడు తలుపు తెరవగానే చెప్పినట్లు వినాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు. చెప్పింది వినకపోతే చెంప పగులకొడతాను అంటూ కోపంగా అన్నాడు. ఒక ఈవెంట్‌కు నన్ను పిలిచి ఇలా మాట్లాడటం నాకు ఆశ్చర్యంగా అనిపించిందని, ఇలా ఎంతో మందిని బెదిరించి, వారు లొంగదీసుకుని, వ్యభిచారం చేయించారు అంటూ పూనం కౌర్ చెప్పుకొచ్చింది. మొత్తానికి పూనం కౌర్ మాటలు ఈ వివాదాన్ని మరింతగా పెంచుతుంది. ముందు ముందు మరెంత మంది ఈ వివాదంలో ఇన్వాల్వ్ అవుతారో చూడాలి.