ఎన్టీఆర్ పై రాజకీయం మొదలయింది…కోర్ట్ నోటీసులు

Politics Started On Ntr Biopic

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. ప్రస్తుతం ఈ చిత్రంకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసి వచ్చే నెలలో చిత్రాన్ని రెగ్యులర్‌ షూటింగ్‌కు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో చిత్ర దర్శకుడు క్రిష్‌ మరియు హీరో బాలకృష్ణకు నాదెండ్ల ఫ్యామిలీ నుండి లీగల్‌ నోటీసులు అందాయి. తమ తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావును ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చెడుగా చూపించబోతున్నారు. అందుకు మేము ఒప్పుకోము అంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.

ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా అయిన సమయంలో నాదెండ్ల భాస్కర్‌ రావు వెన్ను పోటు పొడిచి సీఎం అయ్యాడు అనే టాక్‌ ఉంది. ఆ విషయాన్ని ఈ చిత్రంలో ప్రముఖంగా చూపిస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే నాదెండ్ల భాస్కర్‌ రావు తనయుడు ఈ విషయమై కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. తమ నోటీసులను పట్టించుకోకుండా అలాగే షూటింగ్‌ జరిపితే ఖచ్చితంగా లీగల్‌ నోటీసులతో పాటు, లీగల్‌గా చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ నాదెండ్ల కుటుంబ సభ్యులు హెచ్చరించారు. దాంతో ప్రస్తుతం క్రిష్‌ మరియు బాలకృష్ణలు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. స్క్రిప్ట్‌ మొత్తం పూర్తి అయ్యాక తమ ఫ్యామిలీకి వినిపించాల్సిందే అంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు. సినిమా పూర్తి అయిన తర్వాత మేము చూపిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని కూడా వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఈ విషయమై బాలకృష్ణ మరియు క్రిష్‌లు ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది చూడాలి.