అప్పటి ఎన్‌టి‌ఆర్ ను గుర్తు చేసిన “ఎన్‌టి‌ఆర్” ట్రైలర్…!

NTR Official Trailer

నందమూరి బాలకృష్ణ, జాగర్లమూడి క్రిష్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ అనే చిత్రం రుపొందిన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నందమూరి తారకరామారావు గారి జీవితం ఆధారంగా రూపొందించారు. క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ నుండి ఎన్టీఆర్ పాత్రలో ఉన్న బాలకృష్ణ ఫొటోస్ ను అపుడప్పుడు విడుధలచేస్తూ సినిమా పైన మంచి హైప్ తీసుకువచ్చారు. అప్పటినుండి ఎన్టీఆర్ బయోపిక్ కోసం నందమూరి అభిమానులు అండ్ ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. నిన్న సాయంత్రం జేఅర్సి కన్వెన్షన్ హాల్ లో ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ కు నందమూరి తారకరామారావు గారి కొడుకులు, బిడ్డలు అతిధులుగా విచ్చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ ను ఎన్టీఆర్ నలుగురు కూతుళ్ళు చేతుల మీదుగా విడుదల చేశారు.

balakrishna

ఆ ట్రైలర్ లో బాలకృష్ణ ను చూస్తున్న ప్రేక్షకులు ఆనాటి ఎన్టీఆర్ గారినే తలపించేలా బాలకృష్ణ నటనతోనూ, అభినయంతోను, ఆకారంతోను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఆనాటి ఎన్టీఆర్ అంటే ఎవరో తెలవకపోవచ్చు కానీ బాలకృష్ణను ఎన్టీఆర్ బయోపిక్ లో చూస్తే మాత్రం రామారావు గారు ఇలానే ఉంటారేమో అనే విధంగా క్రిష్, బాలకృష్ణను తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగలుగా విడుదల చేస్తున్నారు. మొదటిది కథానాయకుడు. రెండోవ భాగం మహానాయకుడు. ఈ రెండు భ్గాలకు సంబందించిన ట్రైలర్ ను క్రిష్ ఒకే ట్రైలర్ గా మలిచాడు. ఎన్టీఆర్, బసవతారకం పాత్రలను ఈ ట్రైలర్ లో ఎక్కువసేపు చూపించారు. ఈ చిత్రంలో ఆయ పాత్రలో నటించిన ప్రముఖులు వరసగా రానా, సుమంత్, కైకాల సత్యనారాయణ, విద్యాబాలన్, రాకుల్, తమన్నా, నిత్యమినన్, ప్రణతి,మోహన్ బాబు తదితరు నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చే ఏడాది జనవరి 9 న విడుదలవుతుంది. మహానాయకుడు ఫిబ్రవరి 7 న విడుదలవుతుంది. కీరవాణి సంగితంను అందించారు.