పూనమ్ కౌర్ నోరు తెరిస్తే పవన్ పని అంతేనా ?

Poonam Kaur Controversy Tweets on Pawan Kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పూనమ్ కౌర్ ఈ మధ్యదాకా ఓ సినీ నటి మాత్రమే. కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తరువాత ఆమె దగ్గర ఏదో రహస్యం ఉందని జనానికి అర్ధం అయ్యింది. అప్పట్లో తన మీద విమర్శలు చేస్తున్న పూనమ్ కి కౌంటర్ ఇచ్చిన కత్తి మహేష్ ఆమె పేరు బయటకు తేవడం వల్ల ఆమెకు మేలు జరుగుతుందని చెప్పారు. అప్పట్లో ఆ మాటలు పూనమ్ కి కూడా పెద్దగా రుచించలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూస్తుంటే మాత్రం ఏదో లోగుట్టు బయటపడబోతోంది అనిపిస్తోంది.

“ కాన్సెప్ట్స్ కాపీ చేసి… డైలాగ్స్ కాపీ చేసి… బట్టలు మారుస్తున్నట్టు మనుషులు మారుస్తూ… మాట మీద ఉండకపోవడం… జనాల ఇన్నోసెన్స్ తో ఆడుకుంటూ… వేషభాషలు మారుస్తూ జనాలని మభ్యపెట్టి … అమ్మాయిలని అడ్డం పెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది… ఆ భగవంతుడే నిజం ఏమిటో తెలిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా “ అని తాజాగా పూనమ్ కౌర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నేరుగా పేరు ఎత్తకపోయినా ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారో జనానికి తేలిగ్గానే అర్ధం అవుతోంది. టీడీపీ మీద పవన్ తీవ్ర విమర్శలు చేసిన మరసటి రోజే ఆమె ఈ పోస్ట్ పెట్టడంతో పూనమ్ కౌర్ మాటల్లోని అంతరార్ధాన్ని నెటిజెన్ల బాగానే అర్ధం చేసుకుంటున్నారు.

పూనమ్ కౌర్ ఈ పోస్ట్ తో ఆగే ఆలోచనలో లేరని, అంతకు మించిన రహస్యాన్ని త్వరలో బయటపెడతారని ఓ వర్గం నుంచి వినిపిస్తున్న మాట. ఆమె నోరు తెరిస్తే పవన్ డిఫెన్స్ లో పడతారని కూడా ఆ వర్గం భావన. అయితే ఇదంతా పూనమ్ సొంతంగా చేస్తున్నారా లేక ఎవరైనా ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా పూనమ్ విప్పే ఆ లోగుట్టు కోసం నెటిజెన్ల కాచుకు కూర్చున్నారు.