Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండు మూడు సినిమాలు చేసినా ఆమె పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే కత్తి మహేష్, పవన్ కీ_పూనం కీ ఉన్న సంబంధం బయటపెట్టడంతో ఒక్కసారిగా ఆమె ఫేమస్ అయిపోయారు. పవన్ తెలుగుదేశంతో కాస్త దగ్గరగా ఉన్న సమయంలో పూనం ని ఆంధ్రప్రదేశ్ చేనేతల బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అయితే కత్తి మహేష్ అయితే పవన్ పూనం ల మధ్య ఏదో సంబంధం ఉందని ఆరోపణలు చేసిన నాటి నుండి పవన్ కానీ… పూనం కానీ ఏ సందర్భంలోను స్పందించలేదు. ఒకవేళ వారిద్దరి మధ్య ఏదైనా బందం ఉన్నా తదుపరి పూనం ట్వీట్లని బట్టి పవన్ కి పూనం కి మధ్య ఉన్న బందం మసక బారిందనే చెప్పాలి. ఎందుకంటే పవన్ చేస్తున్న ప్రతి ట్వీట్ కి పూనం కౌంటర్ ఇస్తూనే ఉంది.
అంతేకాక మొన్నటికి మొన్న బైసాఖి ఉత్సవం సమయంలో ఏబీఎన్ ఇంటర్వ్యులో ఎవరో తనని మోసం చేసినట్టు, టైం వస్తే వాళ్ళ భరతం పట్టడానికి సిద్దంగా ఉన్నట్టు పూనం తెలిపింది. ఆ సంగతి పక్కన పెడితే పూనం కౌర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం రిషికేష్ లో పూజలు చేసింది. ఐదు కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్న ప్రత్యేక హోదా ఇవ్వాలని హోమం కూడా చేశారు. పవిత్ర గంగానది ఒడ్డున ఏపీ కోసం పూజలు చేయడమంటేనే అందరిలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవంగా పవన్ కు వ్యతిరేకంగా ఇటీవల ఆమె గురుద్వారాలో పూజలు చేశారని పవన్ వ్యతిరేకులు వాదిస్తున్నారు. ఇప్పుడు కూడా పవన్ కి వ్యతిరేకంగానే పూజలు చేసి వాటిని ఏపీకి ప్రత్యేక హోదా కలరింగ్ ఇచ్చారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.