పూనమ్ కౌర్ అప్పట్లో కత్తి మహేష్-పవన్ కళ్యాణ్ వివాదం మీద ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఈ వివాదంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొంతమంది నెటిజన్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సినిమాల కంటే కూడా ఆ వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈ మధ్య సినిమాలను బాగా తగ్గించేసిన అమ్మడు చాలా రోజుల గ్యాప్ తర్వాత మరోసారి ట్విట్టర్ లో ఓ ఘాటు కామెంట్ చేసింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
ఎప్పుడో మరుగున పడిన వివాదాలను పూనమ్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చి లైమ్ లైట్ లోకి రావడానికే ఇలా ట్వీట్ చేసిందన్న వాదన వినిపిస్తోంది. కొంతమంది నెటిజన్లు అయితే ఈ ట్వీట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించే చేసి ఉంటుందని కామెంట్స్ ద్వారా అభిప్రాయపడుతున్నారు. కానీ పూనమ్ నిజంగా ఈ ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించి చేసిందనేది మాత్రం తెలియరావడం లేదు. దీనిపై ఆమెనే డైరెక్ట్ గా స్పందించాలని నెటిజన్లు ఆమె సోషల్ మీడియా ఖాతాలో కోరుతున్నారు.