Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పోర్న్ స్టార్ మియా మాల్కోవతో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ వీడియో ప్రమోషన్ కోసం ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో మియా ఆలోచనలు, భావోద్వేగాల మీద కత్తి ప్రశంసలు కురిపించడంతో పాటు ఎప్పటినుంచో స్త్రీ లైంగిక స్వేచ్చకు అడ్డుకట్ట వేస్తున్న పరిస్థితుల మీద విమర్శలు చేశారు. ఈ క్రమంలో పూనమ్ కౌర్ లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు కత్తికి సూటిగా గుచ్చుకునేట్టు వున్నాయి. పోర్న్ స్టార్ ని గౌరవించే భారత్ లో ఒక మహిళ ఏదైనా విషయం కోసం నిలబడితే మాత్రం ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారంటూ చేసిన ఓ ట్వీట్ సంచలనం గా మారింది. మాములు అమ్మాయి శరీరం, మనసు, ఆత్మ ని చంపేస్తున్నారంటూ పూనమ్ ఆవేదనా భరితంగా చేసిన కామెంట్స్ ఆమె చెప్పకపోయినా కత్తి మహేష్ గురించే అని అందరికీ అర్ధం అయ్యింది.
స్త్రీ లైంగిక స్వేచ్ఛ గురించి మాట్లాడేంత విశాలభావాలున్న మనిషి ఓ మహిళ తనకు వ్యతిరేకంగా మాట్లాడిందన్న కారణంతో ఆమె వ్యక్తిత్వాన్ని తప్పుగా చిత్రీకరించడం మీదే పూనమ్ తన ట్వీట్ ద్వారా ప్రశ్నించింది. ఈ విషయం అర్ధం అయినప్పటికీ కత్తి మహేష్ మౌనం గా ఉండిపోయారు. పూనమ్ ట్వీట్ మీద ఆయన కౌంటర్ చేయలేదు. అయితే పూనమ్ ట్వీట్ తర్వాత మియా, స్త్రీ లైంగిక స్వేచ్ఛ గురించి కత్తి మాట్లాడే ప్రతి మాట తిరిగి ఆయనకే తగులుతున్నట్టు నెటిజెన్ల భావిస్తున్నారు. ఈ విషయం అర్ధం అయ్యింది కనుకే కత్తి సైలెంట్ అయినట్టు తెలుస్తోంది.