Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Posani Krishna Murali Rumunation 2.5 Crores Ntr Big Boss Show
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎన్టీఆర్ హోస్ట్‌గా చేయబోతున్న ‘బిగ్ బాస్’ షో కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ మరియు టీజర్ వచ్చేసింది. ప్రస్తుతం షోలో పాల్గొనేందుకు సెలబ్రెటీలను ఎంపిక చేసే కార్యక్రమం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి సీజన్‌తోనే ప్రేక్షకులకు బిగ్ బాస్‌పై భారీ అంచనాలు పెంచాలనే ఉద్దేశ్యంతో అంతా సెలబ్రెటీలను తీసుకుని భారీ టీఆర్పీ రేటింగ్ సాధించాలని స్టార్ మా భావిస్తుంది. అందుకోసం పలువురు సెలబ్రెటీలతో సంప్రదింపులు జరుపుతుంది.
వెండి తెరపై ఎన్నో విభిన్న పాత్రలు పోషించి, నటుడిగా తనదైన ప్రత్యేక స్థానంను సంపాదించుకున్న పోసాని కృష్ణ మురళిని ఈ షో కోసం భారీ పారితోషికం ఇచ్చి మరీ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు మూడు నెలల పాటు పోసాని కృష్ణ మురళి డేట్లను స్టార్ మా తీసుకుంది. అందుకోసం 2.5 కోట్ల పారితోషికాన్ని ఆయనకు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. సాదారణంగా పోసాని ఒక సినిమాకు 15 నుండి 30 లక్షల పారితోషికం తీసుకుంటాడు. అయితే బిగ్‌బాస్‌కు అంత పారితోషికం ఇస్తున్నారు అంటే పోసానిపై చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇదే షోకు తేజస్వినీ మరియు మధుశాలినిని కూడా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. వారికి 30 లక్షల పారితోషికాన్ని ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ముంబయిలోని ఒక ఇంట్లో ఈ షో ప్రారంభం కాబోతుంది.
మరిన్ని వార్తలు