పరుచూరి భార్యను చంపేద్దామని కత్తి కొన్నాడట పోసాని !

Posani-Krishna-murali-on-Na

పోసాని కృష్ణ మురళి దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, పొలిటీషియన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఆయన సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ భార్యపై చేసిన కామెంట్స్ సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ పరుచూరి గోపాలకృష్ణ భార్యను చంపేద్దామని అప్పట్లో కత్తి కొన్నా అంటూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైంది. పోసాని కృష్ణమురళి కెరియర్ స్టార్టింగ్‌లో రచయితగా పరుచూరి బ్రదర్స్ వద్ద శిష్యరికం చేశారు. వాళ్లతో కలిసి చాలా చిత్రాలకు పనిచేశారు. అప్పట్లో పరుచూరి ఇంట్లోనే ఉండేవారు పోసాని. రచయితగా ఓనమాలు నేర్చుకున్న పోసానికి తన గురువు భార్యను చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో ఆయన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పోసాని మాట్లాడుతూ నేను పరుచూరి గోపాలకృష్ణ గారి భార్యని పిన్నిగారు అని పిలుస్తా. తల్లితో సమానం. ఆవిడకు నాపై ఏవో కల్పించి చెప్పారు. ఏం చెప్పారో నాకు తెలియదు కాని ఆమె నన్ను దూరం పెట్టి ఇదిగా చూసేశారు. నాకు కోపం వచ్చేది. నేను చాలా సిన్సియర్‌గా పనిచేస్తున్నా ఇంతకంటే ఏం చేయాలి నేను. నన్ను ఒకమాట అంటే గుండెల్లో పొడుచుకున్నట్టు ఉండేది. అప్పట్లో నా కోపం ఎలా ఉండేది అంటే ఒక కత్తి కొన్నా గోపాలకృష్ణగారి భార్యను పొడవటానికి. అంత కోపం వచ్చింది ఆమెపై. కాని ఆ తరువాత ఆలోచించి సిగ్గుపడ్డా. చాలా కుమిలిపోయా’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ తరహా కామెంట్స్ గతంలోనూ చేశారు పోసాని. నేను ఎవరో తెలియకుండా నన్ను శిష్యుడిగా పెట్టుకుని నాకు లైఫ్ ఇచ్చారు. అలాంటిది ఏదో చిన్న మాట అన్నారని బయటకు వచ్చేసి పిన్ని గారిని చంపేద్దాం అని ఆలోచన చేయడం తప్పని తరువాత తెలుసుకుని కుమిలిపోయానని అన్నారు పోసాని.