నయనతార హీరోయిన్‌గా నెల్సన్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘కోకో కోకిల’ చిత్రం ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు వారాల క్రితం తమిళంలో విడుదలై సంచలన విజయాన్ని దక్కించుకుంది. తమిళంలో కేవలం రెండు వారాల్లోనే సినిమా 20 కోట్లను వసూళ్లు చేసి అందరికి షాక్‌ను ఇచ్చింది. దాంతో తెలుగులో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని నిర్మాతలు ఆశించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి రివ్యూవర్స్ నుండి పాజిటివ్ టాక్ దక్కింది. సినిమాకు పెద్దగా పోటీ కూడా లేదు. అయినా కూడా సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టడంలో విఫలం అవుతుంది.
తెలుగు ప్రేక్షకులు ఈమద్య కాలంలో డబ్బింగ్ చిత్రాలను ఆధరించడమే మానేశారు. ఇక ఈ చిత్రం ఒక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం అవ్వడంతో ప్రేక్షకులు ఈ చిత్రం వైపే చూడటం లేదు. పైగా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరగా లేదని, దానికి తోడు ఈ చిత్రంలో హింస ఎక్కువగా ఉందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. దానికి తోడు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఉండవని తేలడంతో ఈ చిత్రంను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దాంతో కలెక్షన్స్ మినిమం కూడా రావడం లేదని ట్రేడ్ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. రెండవ వారంలోనే సినిమా దాదాపు అన్ని థియేటర్ల నుండి తొలగించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.