విజయవాడ సనత్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు, అతని సోదరి మీద ముంతాజ్ అనే ఆమె పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో అతని సోదరి హజున్నీ మృతి చెందగా, ప్రియుడు ఖలీల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఖలీల్ కి అన్న భార్య ముంతాజ్తో ఖలీల్‌కు వివాహేతర సంబంధం ఉంది. అయితే ఆయన ఆ బంధాన్ని పట్టించుకోకుండా మూడు నెలల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నారు. అయితే తనను పట్టించుకొని ఖలీల్ ని, అతని జీవితంలోకి వచ్చి తనకు అతన్ని దూరం చేసిన అతని భార్యను కలిపి చంపేందుకు ముంతాజ్ కుట్రపన్నింది. ఈ నేపథ్యంలో ఖలీల్ భార్య అనుకొని ఖలేల్ పక్కనే నిద్రిస్తున్న సోదరిపై పెట్రోల్ పోసి ముంతాజ్ నిప్పంటించింది. అయితే మృతురాలు హజున్నీ మానసిక వికలాంగురాలు కావడం గమనార్హం.