ఈడీకి చివాట్లు జగన్ కి ఊరట…ఆస్తుల జప్తు రద్దు

'Power' relieves Jagan from courts, CBI and ED cases!

ఈడీ కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో జగన్ నివాసం లోటస్ పాండ్, బంజారాహిల్స్‌లోని సాక్షి హెడ్ ఆఫీసు, బెంగళూరులోని కామర్స్ మంత్రి భవనం, పలు కంపెనీల్లో జగన్ షేర్లు సహా మొత్తం రూ. 700 కోట్ల ఆస్తుల జప్తును ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్రద్దు చేసింది.

వైఎస్ భారతి ఆస్తులను జప్తు చేయడాన్ని తప్పుబట్టిన ఈడీ ట్రిబ్యునల్ వెంటనే వాటిని విడుదల చేయాలని ఆదేశించింది. వాన్ పిక్ కేసులో వైఎస్ జగన్, నిమ్మగడ్డ ప్రసాద్‌ ఈడీ ట్రిబ్యునల్ఊరటనిచ్చింది. ఈ కేసులో ఈడీ జప్తు చేసిన జగన్, నిమ్మగడ్డ ఆస్తులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ట్రిబ్యునల్తీర్పుతో ఇడుపులపాయలో 42 ఎకరాలు, పులివెందులలో 16 ఎకరాలు, బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ప్లాటు, కమర్షియల్ స్థలం, షేర్లు, సాక్షి టీవీ జప్తు రద్దయ్యింది. ఈ ఆస్తుల విలువ మొత్తం రూ.538 కోట్లు. వాన్ పిక్ భూములు సహా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన రూ.325 కోట్ల ఆస్తుల జప్తును కూడా ట్రిబ్యునల్ రద్దు చేసింది.

రూ. 274 కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని నిమ్మగడ్డను ట్రిబ్యునల్ఆదేశించింది. వాన్‌పిక్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారం సరిగా లేదని అప్పిలేట్ ట్రిబ్యునల్ఈడీకి చివాట్లు పెట్టింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను రద్దు చేసింది.rdx