రవితేజ కోసం మరోసారి పవర్ స్టార్?

Power star once again for Ravi Teja?
Power star once again for Ravi Teja?

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కు రాబోతున్న మూవీ ల్లో మాస్ మహారాజ రవితేజ అలాగే భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ మూవీ “మిస్టర్ బచ్చన్” కూడా ఒకటి. మరి ఈ మూవీ ట్రైలర్ తర్వాత మరిన్ని మంచి అంచనాలు పెంచుకోగా ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ సమయం దగ్గరకి వస్తుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అయితే మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట. కానీ పవన్ రావడానికి ఎంత అవకాశం ఉందో రాకపోవడానికి కూడా అంతే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది . మరి ఇదే కానీ నిజం అయితే రవితేజ, పవన్ కళ్యాణ్ ల అభిమానులకు పండగే అని చెప్పాలి. మరి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ రవితేజ నటించిన “నేల టిక్కెట్టు” ప్రీ రిలీజ్ కి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అప్పుడు విజువల్స్ అభిమానులు ఎంతో పదిలంగా దాచుకున్నారు. మరి రెండోసారి ఈ కలయిక సాధ్యం అవుతుందో లేదో వేచి చూడాలి.