Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇంకా టైటిల్‌ను నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ మెల్లగా జరుగుతుంది. ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నప్పటికి కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ప్రస్తుతం ఒక షెడ్యూల్ మిగిలి ఉంది. త్వరలోనే ఆ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్‌కు పవన్ డెడ్‌లైన్ పెట్టాడని, ఆ డేట్ ప్రకారం త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
జనసేన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పవన్ సిద్దం అవుతున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. నవంబర్ మూడవ వారంకు షూటింగ్‌ను పూర్తి చేయాలని, డబ్బింగ్‌తో పాటు తనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని త్రివిక్రమ్‌కు సూచించాడు. అందుకే యూరప్ షెడ్యూల్‌ను ఎక్కువ రోజులు పొడిగించకుండా వెంటనే ముగించాలని త్రివిక్రమ్ నిర్ణయించాడు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రీ డిజైన్ చేశాడు. ఇద్దరు హీరోయిన్స్‌తో పాటు ముఖ్య తారాగాణంతో యూరప్‌లో చిత్రీకరణ జరుపబోతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ హైదరాబాద్‌లో కొన్ని సీన్స్‌ను చిత్రీకరించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా టీజర్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.