సినిమాల్లో హిట్లు, ప్లాపులే కాకుండా, ఏ హీరోకూ లేనంత క్రేజ్ సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోనూ ఎన్నో అవరోధాలను అధిగమించి తిరుగులేని గెలుపును అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పవన్‌ను ‘పవన్ కాదు.. తుఫాన్’ అంటూ ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి పదవికి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. కోట్ల రూపాయల సంపాదన ఉన్నా.. కొంతమంది తమ జేబిలోంచి ఓ పది రూపాయలు తీసి దానం చేయడానికి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ పవన్ ప్రజల సంక్షేమం కోసం తన సంపాదనను త్యాగం చేస్తూ, ఎన్నో దాన ధర్మాలు చేశారు. ఇంత మంచి మనసున్న పవన్ కళ్యాణ్ గురించి మీరేం అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.