ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్‌లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ఫెక్ట్. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్‌కు డార్లింగ్. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. రీసెంట్గా ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించిన ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఒక పక్క మిస్టర్ ఫర్ఫెక్ట్గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తూనే.. మరో పక్క మిర్చిలా రికార్డుల ఘాటును పెంచాడు. రెబల్ స్టార్ ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్‌లో కనిపించడానికి ప్రయత్నిస్తాడు. ‘ఈశ్వర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ‘ఛత్రపతి’తో యాక్షన్ హీరోగా…‘బుజ్జిగాడు’తో మాస్ హీరోగా అలరించి…‘బాహుబలి’తో హాలీవుడ్ వరకూ తన సత్తా చాటాడు ప్రభాస్.
బాహుబలి సిరీస్‌తో భారతీయ ప్రేక్షకులతో సాహో అనిపించిన ప్రభాస్…1979 అక్టోబర్ 23న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తురులో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. 2002లో కృష్ణంరాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా “ఫ్రెండ్స్ మూ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్” అనే మార్కెటింగ్ సంస్థ ప్రభాస్ ని ఉద్దేశిస్తూ ఒక పాటను విడుదల చేసింది. సాహోరే సాహోరే అని ‘అర్మాన్ మెరుగు’ అనే సింగర్ చాలా ఎనర్జిటిక్ గా పాడారు.దీనిని ఫ్రెండ్స్ మూ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ స్థాపకుడు నాగేంద్ర గాడంశెట్టి ప్రొడ్యూస్ చేసారు.