Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ సినిమాతో ఇండియన్ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. వచ్చే సంవత్సరం సాహో చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్‌కు చిన్న గ్యాప్ ఇచ్చి ప్రభాస్ అమెరికా వెళ్లబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సినిమా కోసమే అని మొదట అనుకున్నారు. కాని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతున్నదాన్ని బట్టి చూస్తుంటే ఒక సర్జరీ కోసం ప్రభాస్ యూఎస్‌కు వెళ్తున్నట్లుగా సమాచారం అందుతుంది.
అమెరికాలోని ఒక ప్రముఖ హెల్త్ కేర్ సెంటర్లో ప్రభాస్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు అని, అక్కడ వారం రోజుల పాటు ఉండి సర్జరీ చేయించుకుంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇండియాకు వచ్చిన తర్వాత మరో 20 రోజులు అంటే మొత్తంగా ఒక నెల పాటు సర్జరీ కారణంగా షూటింగ్‌కు దూరంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సర్జరీ దేనికి, ఎందుకు సర్జరీ అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయమై ప్రభాస్ సన్నిహితులు మరియు స్నేహితులు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, ప్రభాస్ సర్జరీ వార్తలు కేవలం పుకార్లే అంటూ చెబుతున్నారు. ఏది నిజం అనేది ప్రభాస్ నుండి స్పందన వస్తే అప్పుడు తేలిపోతుంది.