ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుందని ఆశిస్తున్న ప్రభాస్ అభిమానులు

ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుందని ఆశిస్తున్న ప్రభాస్ అభిమానులు

ప్రస్తుతం బాలీవుడ్ పీఆర్వోలు వరుసబెట్టి ప్రభాస్ కొత్త సినిమా గురించి ట్వీట్లు వేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలోనే ఫస్ట్ లుక్ వాయిదా పడిందని అంటున్నారు. అంతే కాదు.. ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఖరారైనట్లుగా వాళ్లు ట్వీట్లు వేస్తున్నారు. ఆ ట్వీట్లన్నీ ఒకే రకంగా ఉండటంతో చిత్ర బృందమే అక్కడి పీఆర్వోలకు హింట్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

ఇంతకుముందు ‘జాన్’ అనే ఓ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ.. దాని విషయంలో వెనక్కి తగ్గినట్లున్నారు. ఇప్పుడొస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ ప్రేమకథకు ఈ టైటిల్ ఖరారైనట్లే అనిపిస్తోంది. కచ్చితంగా ఇంకో వారం లోపు ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘సాహో’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. ఇంకో 20 శాతం దాకా చిత్రీకరణ మిగిలున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదలయ్యే అవకాశముంది.