చరణ్ కూతురు క్లీంకారకు ప్రభాస్ ‘కల్కి’ నుండి స్పెషల్ గిఫ్ట్ !

Prabhas 'Kalki' special gift for Charan's daughter Kleenkara..
Prabhas 'Kalki' special gift for Charan's daughter Kleenkara..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలోని బుజ్జి, భైరవ పాత్రలతో మేకర్స్ ‘కల్కి’ సినిమాపై పిల్లల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్లు, టీ షర్ట్స్‌ను విక్రయిస్తున్నారు. అలాగే, సెలబ్రిటీ పిల్లలకు గిఫ్టులుగా పంపించి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Prabhas 'Kalki' special gift for Charan's daughter Kleenkara..

రామ్ చరణ్ కూతురు క్లీంకార కూడా ఈ బహుమతులు అందుకుంది. దీనితో ‘థ్యాంక్స్ కల్కి టీమ్. ఆల్ ది బెస్ట్’ అంటూ క్లీంకార బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు..