ప్రభాస్‌ కొత్త సినిమా కోసం…!

Prabhas Movie Shooting In Italy

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రస్తుతం ‘సాహో’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది. సుజీత్‌ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలోనే మరో సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ప్రభాస్‌ పాల్గొంటున్నాడు. ‘సాహో’ తర్వాత ప్రభాస్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఒక లవ్‌ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ తాజాగా ప్రారంభం అయ్యింది. ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ప్రభాస్‌ తాజాగా చిత్రం షూటింగ్‌ కోసం ఇటలీ వెళ్లాడు.

sahooo.

‘జిల్‌’ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రం 50 ఏళ్ల క్రితం నేపథ్యంలో ఉండబోతుంది. ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం అందుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో ఎక్కువ శాతం షూటింగ్‌ను ఇటలీలో నిర్వహించబోతున్నారు. అందుకోసం ఇటలీకి చిత్ర యూనిట్‌ సభ్యులు వెళ్లారు. తాజాగా ఈ చిత్రం లుక్‌ కూడా రివీల్‌ అయ్యింది. ఈ లుక్‌లో ప్రభాస్‌ చాలా లావుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొత్త గెటప్‌ తో పాటు విభిన్నమైన మేకోవర్‌తో ప్రభాస్‌ కనిపించబోతున్నాడు. మొత్తానికి ప్రభాస్‌ కొత్త సినిమాలో లుక్‌ చాలా విభిన్నంగా ఉండబోతుంది.

sahooo